Friday, August 10, 2007

గ్రంధాలయ వారోత్సవాలు

శ్రీ కాళహస్తి పురపాలక సంఘం బాబు అగ్రహారం ఉన్నత పాఠ్శాల యందు 1.8.07 సాయంత్రం బాలల సంఘాల ప్రామాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిధులుగ శ్రీ కాళహస్తి పురపాలక సంఘ మాజీ ఛేర్మన్ శ్రీ.శాంతారాం జె.పవార్ గారు, రాష్త్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ.సువర్ణ వినాయక్ గారుM.E.O.పద్మనాభ రాజు గారు, C.RC.ప్రధానోపాధ్యాయులు శ్రీ మతి నలిణి, శ్రీ.సత్య నారాయణ గారు, శ్రీమతి భూలక్ష్మి, శ్రి.డి.భలసుబ్రమన్యం గారు,ఇతర ఉపాధ్యాయులు పాల్గొనిరి.
బాల సంఘాల ప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పలువురిని ఆకర్షిచినది. అనంతరం శ్రీ వినాయక్ గారు బాబు అగ్రహారం పాఠాశాలలో గ్రంధాలయమును ప్రారంభించిరి.
ఈ కార్యక్రమము M.R.P జయరం ఆధ్వర్యములో జరిగినది.

సుమతీ శతకం

తనకోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయచుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,తన దుఃఖము
నరకమండ్రు, తథ్యము సుమతీ'

బంగారు మాట

విజయం అనేది గమ్యం కాదు. అది ఒక గమనం మత్రమే.
అలాగే జీవితంలో ఎన్నిసార్లు ఓడినను
గెలవడానికి మరో అవకశం ఉంటుంది

Thursday, August 9, 2007

పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం




శ్రికాళహస్తి పురపాలక సంఘ ప్రాధమికోన్నత పాఠ శాల N.T.R.
నగర్ నందు 9.8.07 వ తేది కంప్యూ టర్ ప్రారంభోత్సవం మరియు పిల్లల డైరిలు పంపిణీ జరిగింది.
స్తానికJ.N.Y.Cవారు కంప్యూటర్ను మాజి మునిసిపల్ చేర్మన్ శ్రీ శాంతారాం జె.ఫవార్ గారు కలర్ మానిటర్ను సురేష్ ప్లాజా వారు ఉచిత పుస్తకాలను అందచేసారు.

ఉదయం పాఠశాలలొ జరిగిన కార్యక్రమములొ ఆహుతులకు కుమారి జయప్రద స్వగతం పలుకగ వార్డ్ కౌన్సిలర్ రియాజ్ బాషా గారు అద్యక్షత వహించిరి.శ్రి శాంతరాంగారు కంప్యూటర్ను ప్రారంభించిరి.ఉపాధ్యాయులు తయారు చేసిన క్విజ్ గణిత పాఠాలు ఆకట్టుకొన్నాయి.
అనంతరం యం.ఇ.ఒ.శ్రీ. పద్మనాభ రాజు గారు పుస్తకాలను పంపిణీ చేసారు. శ్రీమతి సుమిత్ర వందన సమర్పణ చేసారు.
ఈ కార్యక్రమానికి సరస్వతిబాయి పురపాల సంఘ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రి.వి.గోపాలస్వామి యం.ఆర్.పి. జయరాం సన్నిధివీధి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ.డి.బాలసుబ్రమణ్యం హాజరైరి. ఈ కార్యక్రమం పాఠశాల H.M. శ్రీమతి.తి.యస్.భారతి నేత్రుత్వంలొ జరిగింది.

Tuesday, August 7, 2007

భరత ఖండంబు

భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియకట్టి '

రాజమండ్రి కాంగ్రెస్ సభలో చిలకమర్తిలక్ష్మీనరసింహంగారు ఆశువుగా చెప్పిన పద్యం.
ఎందరొ మహానుభావుల త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వరాజ్యం. వారి ఆశయాలను నిజం చేయడానికి ప్రయత్నిస్తాం.
సౌజన్యం: ఫెద్ద బాలశిక్ష

Monday, August 6, 2007

బ్లాగులు

ఆదివారం అనుబంధం లొ బ్లాగుల గురించిన సమాచారం చాల బాగుంది. కొత్తగ బ్లాగులు చేసేవారికి ఎంతో ఉపయోగకరం. ఈనాడు వారికి ధన్యవాదాలు.